కేసీఆర్ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం దేవుడు కూడా పుడ్చలేనిదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షి టీమ్స్ ప్రియాంకారెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్ళాయని ఆయన ప్రశ్నించారు. నిరంతరం నిఘా పెట్టల్సిన పోలీసులు ఈ విషయంలోసంపూర్ణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకులపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తూ.. ప్రజాభద్రతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.